పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి: కోటవురట్ల ఎస్ఐ

63చూసినవారు
పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి: కోటవురట్ల ఎస్ఐ
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని కోటవురట్ల మండలం ఎస్ఐ రమేష్ శనివారం తెలిపారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి పండగకు ఊర్లు వెళ్లేవారు నగదు, బంగారం, వెండి ఆభరణాలు బ్యాంకు లాకర్లలో గాని ఇంటిలోని రహస్య ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. బీరువా తాళాలు ఇంట్లో ఉంచరాదని వారితోనే తీసుకెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్