అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారికోసం దీనిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వ్యర్థాలను తొలగించారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.