అనకాపల్లి: పంట కాలవల్లో పూడికతీత పనులకు నిధులు మంజూరు

63చూసినవారు
అనకాపల్లి: పంట కాలవల్లో పూడికతీత పనులకు నిధులు మంజూరు
అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో గల పంట కాలవల్లో పూడికతీత పనులకు రూ. 2. 87 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తక్షణమే వీటికి అంచనాలు రూపొందించి పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సంఘాల ద్వారా పనులు చేయించాలన్నారు. డీఈ స్వామి నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్