ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. గురువారం అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను వినియోగించాలన్నారు. వెలుతురు లేని ప్రాంతాలను గుర్తించి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ నివారణపై దృష్టి సారించాలన్నారు.