అనకాపల్లి: 20న సిరివెన్నెల జయంతి వేడుకలు

64చూసినవారు
అనకాపల్లి: 20న సిరివెన్నెల జయంతి వేడుకలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి 70వ జయంతిని ఈనెల 20వ తేదీన అనకాపల్లి సత్య గ్రాండ్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జయంతికి సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్