అనకాపల్లి: వేసవి క్రీడా శిబిరాలను వినియోగించుకోవాలి

76చూసినవారు
అనకాపల్లి: వేసవి క్రీడా శిబిరాలను వినియోగించుకోవాలి
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్ లో వేసవి క్రీడా శిబిరాలకు సంబంధించిన క్రీడా పరికరాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లాలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలన్నారు. ఆటల వల్ల విద్యార్థుల మనోవికాసం పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్