బుచ్చెయ్యపేట మండలం వడ్డాది రైతు భరోసా కేంద్రం వద్ద రాయితీపై పవర్ టిల్లర్ ను మండల వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, స్థానిక టిడిపి అధ్యక్షుడు దొండా నరేష్ బుధవారం అందజేశారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనులకు పవర్ టిల్లర్ దోహదపడుతుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్రాలు రైతులకు రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు. అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు.