దేవరాపల్లి: వైస్ ఎంపీపీ ఎన్నికపై సమావేశం

74చూసినవారు
దేవరాపల్లి: వైస్ ఎంపీపీ ఎన్నికపై సమావేశం
దేవరాపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఈనెల 19వ తేదీన జరగనున్న నేపాధ్యంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మండలానికి చెందిన వైసిపి ఎంపీటీసీలతో శనివారం సమావేశం నిర్వహించారు. దేవరాపల్లి మండలం తారువా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ తరఫున మామిడిపల్లి ఎంపీటీసీ పంచాడ సింహాచలం నాయుడి మద్దతు పలకాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంపీపీ బుల్లి లక్ష్మి, జడ్పిటిసి కె. సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్