ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ చలపతిరావు పంపిణీ చేశారు. మల్లవరానికి చెందిన లక్ష్మికి రూ. 45, 918, అప్పారాయుడుపాలెంకు చెందిన నూకరాజుకు రూ. 43, 700, ఏటికొప్పాకకు చెందిన అప్పలరాజుకు రూ. 1, 06, 128, పులపర్తికి చెందిన గోపన్నకు రూ. 1, 63, 616 అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో మరికొందరు ఉన్నారు.