బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. గురువారం కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100% మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.