అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడతాయని సెక్టార్ సూపర్వైజర్ రాఘవ తెలిపారు. గొలుగొండ మండలం గొలుగొండలోని అంగన్వాడీ సెంటర్లో మూడేళ్లు పైబడిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం గురువారం చేపట్టారు. తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీలకు పంపాలని రాఘవ కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ రమణమ్మ, స్థానికులు పాల్గొన్నారు.