పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన వాకాడ నూకరాజు అదృశ్యమయ్యారు. ఈనెల 9వ తేదీన భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన అతను అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.