పరవాడ మండలం లంకెలపాలెంలో మరిడిమాంబ పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండగ సందర్భంగా 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ దంపతులు గురువారం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాయంత్రం మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో అనుపోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.