విశాఖ జిల్లా, పెందుర్తి మండలం, చింతగట్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రైతు గొంప ఆనంద్ ఇంట్లో దొంగలు చొరబడి పది తులాల బంగారం, కొంత వెండి, మరియు నగదును దోచుకెళ్లారు. వేసవి తాపం ఎక్కువ కావడంతో ఆనంద్ కుటుంబ సభ్యులు ఇంటి డాబాపై నిద్రిస్తుండగా దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు.