రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ, ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.