వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భూములు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజ్ చెల్లించకుండా పనులు చేపట్టడం దుర్మార్గం అని సిపిఎం, వైసిపి నాయకులు విమర్శించారు. గురువారం నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామంలో నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో సిపిఎం నాయకుడు ఎం అప్పలరాజు, వైసిపి నాయకుడు వీసం రామకృష్ణ పాల్గొన్నారు. ఒకరికి రూ. 25 లక్షలు ప్యాకేజీ చెల్లించాలన్నారు.