పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని గురువారం ఎక్స్ లో పేర్కొన్నారు.