పరవాడ ఎస్ఈజెడ్ పరిధిలో అలివేరా పరిశ్రమలో పనిచేస్తున్న హెల్పర్ పై మిథైల్ రసాయనం పడడంతో తీవ్రంగా గాయపడినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈ ఘటన ఈనెల 8వ తేదీన జరగగా యాజమాన్యం గోప్యంగా ఉంచిందన్నారు. హెల్పర్ జిహన్ అన్సర్ ను అగనంపూడి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీనిపై విచారణ జరపాలన్నారు.