పరవాడ ఫార్మసిటీ ఠాగూర్ ల్యాబరేటరీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గాజువాక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా బుధవారం సాయంత్రం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వారు వైద్యులను ఆదేశించారు.