పరవాడ ఠాగూర్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందడం పట్ల అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని బుధవారం ఆదేశించారు. పార్లమెంట్ నుంచి నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.