పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై షీలా నగర్లో చికిత్స పొందుతున్న కార్మికులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి శుక్రవారం రాత్రి పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు. భద్రత ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.