పరవాడ: బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం

78చూసినవారు
పరవాడ: బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గత నెల 29న మృతి చెందిన దిబ్బపాలెంకు చెందిన మత్స్యకారుడు కొరివి మసేను కుటుంబానికి ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత రూ. 25, 000 ఆర్థిక సహాయం అందించారు. గురువారం సంస్మరణ కార్యక్రమంలో మసేను చిత్రపటానికి ఆమె పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కుటుంబానికి రావలసిన నష్టపరిహారం మంజూరు చేయిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్