మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ పోలీస్ బ్యూరో సమావేశంలో పెహల్గాం దాడిలో మృతి చెందిన అమర జవాన్లకు నివాళులు అర్పించినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నట్లు తెలిపారు. మహానాడు నిర్వహణపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.