సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో ప్రతిష్ఠించారు. భక్తులు గోత్రనామాలతో సంకల్పం చేసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. జీలకర్ర–బెల్లం, మాంగళ్యధారణ వంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా సాగాయి. అనంతరం వేద ఆశీర్వచనాలతో అంతరాలయ దర్శనం కల్పించారు.