అడివివరం–కొంత్యాం మార్గంలో నకిలీ పోలీసుల బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది. చినగంట్యాడకు చెందిన కోదాడ జయరాం (27) ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో తన మరదలితో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా, భైరవవాక దగ్గర పోలీసులతో వేషధారులు అతడిని ఆపి రూ.20వేలు డిమాండ్ చేశారు. అందలేకపోయేసరికి యూసీఐ సిమెంట్ వద్ద రూ.5వేలు తీసుకొని పరారయ్యారు. జయరాం వాట్సాప్ ద్వారా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.