వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ బుధవారం తాడేపల్లిలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు.