పెందుర్తి: అమ్మవారిని దర్శించుకున్న జీవీఎంసీ కార్పొరేటర్

67చూసినవారు
పెందుర్తి: అమ్మవారిని దర్శించుకున్న జీవీఎంసీ కార్పొరేటర్
పెందుర్తి మండలం గొల్లవిల్లివాని పాలెంలో కొలువై ఉన్న బంగారమ్మ తల్లి పండగను గురువారం ఘనంగా నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం కార్పొరేటర్ ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్