ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలను అర్హులందరికీ కేటాయించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం పెందుర్తి తహసిల్దార్ కు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.