పెందుర్తి సుజాత నగర్లో నివసించే డాక్టర్లు రాఘవేంద్ర దంపతులు ఇంటి పనుల కోసం సత్యవతిని పని మనిషిగా పెట్టుకున్నారు. ఈ నెల 25న ఇంట్లో 17 తులాల బంగారు ఆభరణాలు దొంగిలిచారని ఫిర్యాదు చేయగా, విచారణలో సత్యవతే దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఆమె వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు.