జీవీఎంసీ 95వ వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం పెందుర్తి మండలం చినముషిడివాడలో జోనల్ కమిషనర్ హైమావతి అధ్యక్షతన సమీక్షలో ఆయన మాట్లాడుతూ. వివిధ దశలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.