పెందుర్తి: బొగ్గు,ఫ్లై యాష్ లారీల రవాణాలో నిబంధనలు పాటించాలి

10చూసినవారు
లంకెలపాలెం జంక్షన్ మీదుగా ప్రతిరోజు ప్రయాణిస్తున్న బొగ్గు, ఫ్లైయాష్ లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడులతో, కనీసం తార్పల్లిన్స్ కూడా కట్టకుండా అతి వేగంగా ప్రయాణం చేయడంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ బొగ్గు లారీల యాజమాన్యాలకు ఎన్నిసార్లు దీనిపై హెచ్చరికలు జారీ చేసినా వారు పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్