సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను బదిలీ చేస్తూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబును విజయవాడ దుర్గగుడికి, అసిస్టెంట్ ఇంజినీర్ రామరాజును కనకమహాలక్ష్మి దేవస్థానానికి, సూపరింటెండెంట్ సునీల్ కుమార్‌ను అరసవెల్లికి బదిలీ చేశారు.