విశాఖలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 25 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 20 తులాల బంగారం రికవరీ చేశారు. పెందుర్తి లో డాక్టర్ రాఘవేంద్ర ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తున్న సత్యవతి బంగారాన్ని చోరీ చేసిందని గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వేర్వేరు కేసులను కూడా ఛేదించి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.