మునగపాక మండలం రామారాయుడుపాలెంలో గురువారం మరిడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించనున్నారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉచితంగా అందజేస్తున్నారు.