రావికమతం మండలం చలిసింగం గ్రామ రహదారి పనులను చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు బుధవారం పరిశీలించారు. రహదారి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.