మానవాళికి, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కు ప్రజలు దూరంగా ఉండాలని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వీసీ సూర్య ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వర్సిటీ కార్యాలయంలో సిబ్బందికి జూట్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా క్లాత్తో చేసిన సంచులు, జ్యూట్ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వల్ల పలు వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.