మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు అనకాపల్లి జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి. ప్రభాకర్ రావు పలు సూచనలు చేశారు. మంగళవారం సబ్బవరం మండలం అమృతపురంలో మాట్లాడుతూ మామిడి తోటల్లో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు. మామిడి తోటలకు పూతకు వచ్చినప్పటి నుంచి తేలికపాటి నీటితడులు ఇవ్వాలన్నారు. పిందె కట్టే సమయంలో రెండుసార్లు ఎరువులు వేసుకోవాలన్నారు.