సబ్బవరం: శాప్ సభ్యునిగా పీబీవీఎస్ఎస్ రాజు

54చూసినవారు
సబ్బవరం: శాప్ సభ్యునిగా పీబీవీఎస్ఎస్ రాజు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యుడుగా (శాప్) సబ్బవరానికి చెందిన పీబీవీఎస్ఎస్ రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం శాప్ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వం శాప్ సభ్యులుగా ఎనిమిది మందిని నియమించగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తనకు అవకాశం కల్పించినట్లు రాజు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్