పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. వ్యవసాయదారుడు గొంప ఆనంద్ ఇంట్లోకి దొంగలు చొరబడి 10 తులాల బంగారం, కొంత వెండి, నగదు అపహరించారు. కుటుంబ సభ్యులు మేడపై నిద్రిస్తున్న వేళ ఈ చోరీ జరిగింది. గ్రామంలో బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని సమాచారం.