సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆదివారం మిథున సంక్రమణ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు సంప్రోక్షణ చేసి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కలిసి పల్లకిపై తీసుకెళ్లారు. సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ తిరువీధి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.