విశాఖపట్నంలోని దొండపర్తి నెహ్రూ బజార్ లో గురువారం కురిసిన వర్షాలకు వర్తక భవనం శ్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో వ్యాపారులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పలు కాలనీల్లో అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.