అప్పన్నపాలెం: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

61చూసినవారు
అప్పన్నపాలెం: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందారు. రాజవొమ్మంగి మండలం అప్పన్నపాలెంకు చెందిన కంచుబోయిన అప్పయ్యమ్మ రహదారి వెంట నడచుకుంటూ వస్తుండగా వేపగుంట నుంచి పాతగోశాల వైపునకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు బలంగా ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. కాగా ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు కూడా గాయపడి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్