కోటవురట్ల మండలం పి. రామన్నపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం పిడుగు పడి పాడి ఆవు మృతి చెందింది. దీని విలువ రూ. 60, 000 ఉంటుందని బాధిత రైతు ఎలమంచిలి వెంకన్న తెలిపారు. రోజు 10 లీటర్ల పాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆవు ఇచ్చే పాలపైన ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు తెలిపారు. పాలిచ్చే ఆవు మృతి చెందడంతో జీవనాధారాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.