క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద

56చూసినవారు
క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద
దేవీపట్నం మండలంలో గోదావరి వరద క్రమేపి పెరుగుతోంది. గురువారం ఉదయానికి దండంగి గ్రామ సమీపంలో ఉన్న పొలాలను ముంచుతూ, ప్రధాన రోడ్డుపైకి నీటి ప్రవాహం వచ్చేసిందని స్థానికులు తెలిపారు. ఇటువైపు నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, మరింత నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దండంగి, డి రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డు పైకి నీరు మరింత చేరుకుంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్