వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లాలో మండపాల ఏర్పాటుకు కలెక్టరేట్ కు ఆఫ్ లైన్ లో 111 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది వాటిని పోలీస్ శాఖకు పంపించారు. బుధవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ లో మరో 1100 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.