149 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు

53చూసినవారు
149 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
విశాఖ జిల్లాలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 149 మంది వాహనచోదకుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం బుధవారం విశాఖలో తెలిపారు. ఇటీవల హెల్మెట్ లేని 227 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి డ్రైవర్ లైసెన్స్ రద్దు కోరుతూ రవాణా శాఖకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వారిలో 149 మంది లైసెన్సు తాత్కాలికంగా రద్దు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్