ఎన్నో చిత్రాల్లో నటించిన ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆయనకు విశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆర్థిక సాయం చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు నేపథ్యంలో అచ్చుతరావు ఆర్థిక సాయం చేయడంతో గురువారం అచ్చుతరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫిష్ వెంకట్ ప్రకటన విడుదల చేశారు.