అమర్నాథ్ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు
వైయస్సార్సీపి సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో 400 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ సోమవారం జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమర్నాథ్ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.