వెల్ఫేర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆందోళన

74చూసినవారు
వెల్ఫేర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆందోళన
వైసీపీ నేత, మాజీ శాసనసభ్యుడు మళ్ల విజయప్రసాద్‌కి చెందిన వెల్ఫేర్ గ్రూప్ తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇచ్చేవరకూ కదిలేది లేదని బాధితులు రెండో రోజు గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. యాజమాన్యం తమను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఏకంగా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని వస్త్రాలతో కట్టేసి మూసేశారు. సిబ్బంది విజ్ఞప్తి చేయడంతో రాత్రి ఏడున్నర ప్రాంతంలో తలుపులు తీసి వారిని బయటకు పంపించారు.

సంబంధిత పోస్ట్