ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ, ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , థట్ రుయా వారి భాగస్వామ్యంతో కువైట్‌లోని నిర్మాణ రంగంలో నైపుణ్య ఉద్యోగాల కోసం అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల కార్యక్రమాన్ని ప్రారంభించాయని అనకాపల్లి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఐటిఐ డిప్లమో చదువుకున్న అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు